టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ వైరల్
డొనాల్డ్ ట్రంప్ తో ప్రత్యేక సమావేశం
అమెరికా – టెస్లా చైర్మన్ , స్పేస్ ఎక్స్ , ఎక్స్ చీఫ్ ఎలోన్ మస్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ కుబేరుల్లో తను టాప్. వ్యాపారవేత్తనే కాదు అత్యంత అనుభవం పొందిన టెక్కీ కూడా. నిత్యం ఏదో ఒకటి కొత్తదనం కోరుకునే వ్యక్తి. పట్టుపట్టి అమెరికాలో తాను కోరుకున్న, తాను అనుకున్న వ్యక్తిని దేశానికి అధినేతగా తిరిగి తీసుకు రావడంలో కీలకమైన పాత్ర పోషించాడు.
సామాజిక మాధ్యమాలు ఎలా సమాజాన్ని, ప్రజలను, దేశాలను ప్రభావితం చేస్తాయో తన ఎక్స్ ద్వారా నిరూపించాడు. అంతే కాదు తానే దగ్గరుండి రిపబ్లికన్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించాడు. ఓ వైపు బైడెన్ సర్కార్ కు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. అనుకున్నది ఎట్టకేలకు సాధించాడు.
ఒక రకంగా సక్సెస్ చేస్తానని ప్రకటించాడు. అనుకున్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ను విజయం సాధించేలా కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు భారీ విజయం సాధించిన అనంతరం ట్రంప్ అమెరికా జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. అందులో ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు టెస్లా చైర్మన్ ను.
ప్రస్తుతం కొలువు తీరిన ప్రభుత్వంలో కీలకమైన పాత్రను పోషించనున్నాడు ఎలాన్ మస్క్. ఇదిలా ఉండగా ట్రంప్ తో పాటు ఇతరులతో కలిసి ఎలోన్ మస్క్ ఉన్న ఫోటోను తాజాగా షేర్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ గా మారింది.