టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ వైరల్
మరోసారి డొనాల్డ్ ట్రంప్ తో ములాఖత్
అమెరికా – టెస్లా చైర్మన్ , స్పేస్ ఎక్స్ ఫౌండర్, ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఏది చేసినా సంచలనమే. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన వ్యాపారవేత్తలలో, అపర కుబేరులలోని 10 మందిలో తను టాప్ లో కొనసాగుతూ వస్తున్నారు.
ఎవరూ ఊహించని రీతిలో ఈసారి అమెరికాలో జరిగిన దేశ అధ్యక్ష ఎన్నికల్లో తను కీలకమైన పాత్ర పోషించారు. ఈ సందర్బంగా ఆయన బేషరతుగా, బహిరంగంగానే రిపబ్లికన్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా డొనాల్డ్ ట్రంప్ కు ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టారు.
అంతే కాకుండా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించాలంటే తన లాంటి వారి సపోర్ట్ అవసరమని పేర్కొన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేంందుకు కీలక పాత్ర పోషించాడు. తను పడిన కష్టం ఫలించింది. ఈ మేరకు ఊహించని ఫలితాలు వచ్చాయి. హోరా హోరీగా సాగుతుందని భావించిన ఈ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా సాగాయి. డొనాల్డ్ ట్రంప్ అద్భుత విజయాన్ని సాధించారు.
ఈ సందర్బంగా ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ముఖ్యమైన భూమిక ఎలోన్ మస్క్ పోషించ బోతున్నారని ఇప్పటికే ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వీరిద్దరూ ప్రస్తుతం సమాలోచనలు జరుపుతున్నారు. తాజాగా ట్రంప్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు ఎలోన్ మస్క్.