BUSINESSTECHNOLOGY

స్టార్‌షిప్ కల నెర‌వేరిన వేళ

Share it with your family & friends

స‌క్సెస్ సాధించిన ఎలోన్ మ‌స్క్

అమెరికా – టెస్లా చైర్మ‌న్, స్టార్ ఎక్స్ చీఫ్ ఎలోన్ మ‌స్క్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏదో ఒక రోజు ఉప‌గ్ర‌హంలోకి వెళ్లాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించాడు. అనుకున్న‌ది సాధించాడు. కొన్నేళ్ల పాటు అలుపెరుగ‌ని రీతిలో కృషి చేస్తూ వ‌చ్చాడు. స్పేస్ ఎక్స్ ను తీర్చి దిద్దాడు.

ఎలోన్ మస్క్, స్పేస్‌ఎక్స్ బృందం రెండు దశాబ్దాల కలలు, ప్రయత్నాల ఫలితంగా ప్రపంచంలోని మొట్ట మొదటి పూర్తిగా పునర్వినియోగ కక్ష్య రాకెట్ ఏర్పడింది. ఈ క‌ల సాకారానికి శ్రీ‌కారం చుట్టింది 2003లో. దాదాపు 21 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింది. స‌క్సెస్ గా న‌డుస్తోంది.

ఒక సూపర్-హెవీ లిఫ్ట్ వాహనాన్ని చంద్రుని స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి లేదా మార్స్ మిషన్ చేయడానికి ఉపయోగించవచ్చు. అదే హోలీ గ్రెయిల్ లక్ష్యం అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు ఎలోన్ మ‌స్క‌.

దాదాపు 2011లో ఎలోన్ మ‌స్క్ సిద్ధాంత పరంగా ఇది సాధ్యమే అనే నమ్మకాన్ని పొందాడు. త‌మ‌కు సామ‌ర్థ్యం ఉంది. పది సంవత్సరాల తరువాత 2021లో అనేక నమూనాలను రూపొందించిన తర్వాత, ప్రాజెక్ట్ కు సంబంధించిన‌ ఆచరణాత్మక సాధ్యతపై ఎలోన్ మ‌స్క్ న‌మ్మ‌కంతో ఉన్నారు.

ఇదే స‌మ‌యంలో స్టార్ షిప్ చాలా క‌ష్టంగా ఉంద‌ని, దీనిని చేయ‌గ‌ల‌మా అన్న అనుమానం కూడా వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌ని ఓ స‌మ‌యంలో చెప్పారు. మూడు సంవత్సరాల తరువాత, ఐదు ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్‌ల తర్వాత, స్టార్‌షిప్ పూర్తి గా వేగవంతమైన పునర్వినియోగాన్ని సాధించగలదని నిరూపించింది.