డ్యాం గేటు కొట్టుకు పోవడంపై ఆరా
కర్నూల్ కలెక్టర్ తో మంత్రి వాకబు
అమరావతి – ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఆదివారం తెల్లవారు జామున తుంగభద్ర డ్యాంకు చెందిన 19వ గేటు కృష్ణా నది వరద ఉధృతికి కొట్టుకు పోయింది. చైన్ తెగి పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తేల్చారు తుంగభద్ర డ్యాం అధికారులు.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మరో వైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోహంకి కూర్మనాథ్ హెచ్చరించారు. కర్నూల్ జిల్లా లోని నాలుగు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
మరో వైపు సీఎం ఆదేశాల మేరకు అప్రమత్తం అయ్యారు జిల్లా కలెక్టర్ . ఇదే సమయంలో డ్యాం గేటు విషయంపై ఆరా తీశారు ఏపీ మంత్రి టీజీ భరత్. ఆయన ప్రస్తుతం ఇదే ప్రాంతానికి శాసన సభ్యుడిగా ఉన్నారు. కేబినెట్ లో చోటు దక్కింది.
డ్యాంలో నీటి నిల్వ, ఔట్ ఫ్లో పై వాకబు చేశారు . అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి భరత్.