రజనీకాంత్ రియల్ సూపర్ స్టార్
దర్శకుడు టీజీ జ్ఞానవేల్ కామెంట్
చెన్నై – జై భీమ్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు దర్శకుడు టీజీ జ్ఞానవేల్. ఆయన తన కెరీర్ లో మొదట జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆ తర్వాత సినిమా అద్భుతమైన మాధ్యమమని నమ్మాడు. జై భీమ్ సినిమా తీశాడు. ఇది భారతీయ సినిమాను ఒక్కసారిగా ఆలోచింప చేసేలా చేసింది. పలు ప్రశ్నలను సంధించాడు.
ఆ తర్వాత తన తదుపరి చిత్రం తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉంటుందని ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. జై భీమ్ కాన్సెప్ట్ వేరు. కానీ రజనీకాంత్ అంటేనే స్టార్ డమ్ ఉన్న నటుడు. ఆయన మేనరిజంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా తీయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దర్శకులకు కత్తి మీద సాము లాంటిదే.
ఇందులో లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడు. జై భీమ్ తో ఎందరో మేధావులు, నాయకులను ప్రభావితం చేసిన టీజీ జ్ఞానవేల్ ఉన్నట్టుండి కమర్షియల్ సినిమా తీస్తే సక్సెస్ అవుతాడా అన్న అనుమానం కూడా తలెత్తింది చాలా మందిలో. కానీ ఊహించని రీతిలో వేట్టైయాన్ పేరుతో సినిమా తీశాడు. దీనిని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. దాదాపు రూ. 160 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఊపునిచ్చే మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే మనసాలియో సాంగ్ దుమ్ము రేపుతోంది. సింపుల్ స్టెప్పులతో ఆకట్టుకునే డ్యాన్స్ తో అదుర్స్ అనిపించేలా చేశారు రజనీకాంత్ , మంజూ వారియర్. ఈ సందర్బంగా రజనీకాంత్ గురించి దర్శకుడు టీజీ జ్ఞానవేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకులు మెచ్చిన నటుడు అంటూ కితాబు ఇచ్చారు.
తాను ఆయనను చూసి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు టీజీ జ్ఞానవేల్.