తెలంగాణ టెట్ ఫలితాలు వెల్లడి
విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ టెట్ -2024కు సంబంధించిన పరీక్షా ఫలితాలను బుధవారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను అభినందించారు. త్వరలోనే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని శుభవార్త చెప్పారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెంద వద్దని సూచించారు.
ఇదిలా ఉండగా టీజీ టెట్ 2024 కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేకున్నారు. ఇందులో భాగంగా పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా మొత్తం 57,725 అభ్యర్థులు పాస్ అయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరు అయితే 51,443 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
పేపర్ -1 లో అర్హత సాధించిన వారు 67.13 శాతం కాగా పేపర్ -2లో అర్హత పొందిన వారు 34.18 శాతంగా ఉండడం విశేషం. పరీక్షా ఫలితాలకు సంబంధించి https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.