Friday, June 6, 2025
HomeNEWSTET 2025 పరీక్ష షెడ్యూల్ రిలీజ్

TET 2025 పరీక్ష షెడ్యూల్ రిలీజ్

జూన్ 9 నుండి హాల్ టికెట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) 2025 జూన్ 18న ప్రారంభమై జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ పరీక్ష ప్రతిరోజూ రెండు షిఫ్టులలో, ఉదయం 9:00 నుండి 11:30 వరకు తిరిగి మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:30 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పరీక్ష తొమ్మిది రోజులలో 16 సెషన్‌లతో నిర్వహించనున్న‌ట్లు పాఠశాల విద్యా శాఖ వెల్ల‌డించింది.

పాఠశాల విద్యా డైరెక్టర్, TET చైర్మన్ EV నరసింహ రెడ్డి పోస్ట్ చేసిన సమగ్ర షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు జూన్ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీలలో జరుగుతాయి. జూన్ 9 నుండి, అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS TET పరీక్షకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు, పేపర్ 1కి 63,261 మంది అభ్యర్థులు , పేపర్ 2కి 1,20,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించి పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

పూర్తి షెడ్యూల్ మరియు ఇతర సంబంధిత నవీకరణల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు విద్యా శాఖ డైరెక్ట‌ర్. పరీక్షలు వివిధ జిల్లాల్లో జరుగుతాయి. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలి. టెట్ అభ్య‌ర్థులు బాగా చ‌దువు కోవాల‌ని కోరారు పాఠ‌శాల శాఖ డైరెక్ట‌ర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments