విద్యుత్ సంస్థహెచ్చరిక జర జాగ్రత్త
అప్రమత్తంగా ఉండాలన్న టీజీపీడీసీఎల్
హైదరాబాద్ – భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదానికి గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది టీజీపీడీసీఎల్. విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తడిసిన కరెంట్ స్థంభాలను ముట్టు కోవద్దని, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు తాకవద్దని సూచించింది. విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను ముట్టు కోవద్దంటూ హెచ్చరించింది.
ఒకవేళ విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియ చేయాలని సూచించింది. పార్కులలో కానీ , స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలను తాకొద్దని పేర్కొంది టీజీపీడీసీఎల్.
అంతే కాకుండా ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టు కోవద్దంటూ పేర్కొంది. బయట పెట్టిన లైట్లను నీళ్లతో తడవకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. కరెంటు కు సంబంధించిన వస్తువులను తడి చేతులతో ముట్టు కోవద్దంటూ సూచించింది టీజీపీడీసీఎల్.
చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసు కోవాలని పేర్కొంది. క్వార్టర్ లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదని తెలిపింది. గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టు కోవద్దని సూచించింది.
ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును తాకాలని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసి వేయాలని స్పష్టం చేసింది.
ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే సంబంధించిన అధికారి JLM, ALM, LM లేదా AE దృష్టికి తీసుకెల్లాలని కోరింది .