ప్రకటించిన టీజీపీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతిగృహాల్లో మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పలితాలు ప్రకటించింది. ఈ పోస్టులకు గాను గత ఏడాది జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించింది. వీటి కోసం 82 వేల 873 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కమిషన్ ఇప్పటికే రిజల్ట్స్ ప్రకటించింది. తాజాగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఫైనల్ ఫలితాలను వెల్లడించింది.
ఈ సందర్బంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఫలితాలను పూర్తి పాదర్శకంగా వెల్లడించినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. మొత్తం 581 పోస్టులకు గాను 574 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ మేరకు ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టులో జాబితాను ఇచ్చామన్నారు. వీరిలో 561 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, లేడీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపిక అయ్యారని చెప్పారు.. మిగిలిన 13 మంది వార్డెన్, మాట్రన్ గ్రేడ్ 1, గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైనట్లు స్పష్టం చేశారు. ఫైనల్ జాబితాలో ఎంపికైన వారికి త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు.