మూడు నెలల్లో గ్రూప్-2 పరీక్షా ఫలితాలు
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గౌడ్
హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుర్రా వెంకటేశం గౌడ్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ , రేపు జరిగే గ్రూప్ -2 ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను రెండు మూడు నెలల్లోపే విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇందులో ఎలాంటి అనుమానం చెందవద్దంటూ అభ్యర్థులకు సూచించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కంగ్రాట్స్ తెలిపారు చైర్మన్.
రెండు సెషన్స్ లలో గ్రూప్ -2 పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష చేపడతారు.
డిసెంబర్ 16న సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు. 33 జిల్లాల్లో 1,358 కేంద్రాల్లో పరీక్షల నిర్వహిస్తున్నారు.. పరీక్షలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని టీజీపీఎస్సీ వెల్లడించింది.