రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్
హైదరాబాద్ – ఓ వైపు రిజర్వేషన్ల లొల్లి కొనసాగుతుండగానే మరో వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టించు కోవడం లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా గ్రూప్ 3 పరీక్షల రిజల్ట్స్ ను ప్రకటించింది. గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 3 లో కూడా పురుషులే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 10 ర్యాంకులు ప్రకటిస్తే అందులో 9 మంది పురుషులు ఒకరు మహిళ నిలిచారు. టాప్ లో నిలిచిన అభ్యర్థికి 450 మార్కులకు గాను 339 మార్కులు వచ్చాయి. టాప్ 50లో నలుగురు నిలవగా టాప్ -100 జాబితాలో 12 మంది మహిళలు నిలిచారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం, సభ్యులు రామ్మోహన్ రావు, అమీరుల్లా ఖాన్, పాల్వాయి రజనీకుమారి, కమిషన్ ఇంఛార్జి సుమతితో కలిసి ఫలితాలను ప్రకటించారు. మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చినట్లు వెల్లడించారు. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా టీఎస్‌పీఎస్సీ 1,365 గ్రూప్-3 పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. . రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు..