నేడు..రేపు గ్రూప్ -2 పరీక్షలు
ఏర్పాటు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) . ఈ పరీక్ష రెండు సెషన్ లలో జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను లోపలికి అనుమతించే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఇదిలా ఉండగా గ్రూప్ -2 పరీక్ష డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేపర్ -1 పరీక్ష. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరుగుతుందని తెలిపింది టీజీపీఎస్సీ
డిసెంబర్ 16న సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12. 30 గంటల దాకా పేపర్-3 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పేపర్ -4 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ పరీక్షలు 33 జిల్లాల్లో 1,358 కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది పరీక్షకు హాజరు కానున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఆర్టీసీ సమయానికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసింది.