Friday, May 23, 2025
HomeNEWSఅగ్రిగేట‌ర్ కంపెనీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం

అగ్రిగేట‌ర్ కంపెనీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం

ప్ర‌క‌టించిన టీజీపీడ‌బ్ల్యూయు ప్రెసిడెంట్

హైద‌రాబాద్ – తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడ‌బ్ల్యూ) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు షేక్ స‌లావుద్దీన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అగ్రిగేటర్ కంపెనీల అన్యాయమైన పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. , ఓలా, ఉబర్ , రాపిడో ద్వారా నిర్వహించబడుతున్న విమానాశ్రయ ప్రయాణాలను బహిష్కరించాలని ఇప్ప‌టికే పిలుపునిచ్చామ‌ని తెలిపారు. ఈ అగ్రిగేటర్ కంపెనీలు విధించే తక్కువ ఛార్జీల సమస్యకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

ఇది క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు షేక్ స‌లావుద్దీన్. అగ్రిగేటర్ సేవలకు ఏకరీతి, న్యాయమైన ధరలను కోరుతూ ప్రభుత్వానికి, రవాణా శాఖకు పదేపదే ప్రాతినిధ్యాలు ఉన్నప్పటికీ, ఎటువంటి నిర్ణయాత్మక చర్య తీసుకోలేదని అన్నారు. అన్ని గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులకు న్యాయమైన వేతనం, స్థిరమైన జీవనోపాధిని నిర్ధారించడానికి ప్రభుత్వం వెంటనే ఏకరీతి ఛార్జీల నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దోపిడి ఛార్జీల నిర్మాణాల గురించి ప‌దే ప‌దే త‌మ స‌భ్యులు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించు కోలేద‌న్నారు. త‌క్కువ ఛార్జీల వ‌ల్ల ఆదాయం స‌మ‌కూర‌డం లేద‌న్నారు. డ్రైవర్లు, ప్రయాణీకులకు న్యాయమైన ఏకరీతి ఛార్జీల విధానాన్ని అమలు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌ను ముమ్మ‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments