టాక్సీ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
టీజీపీడబ్ల్యూ చీఫ్ షేక్ సలావుద్దీన్ డిమాండ్
హైదరాబాద్ – రాష్ట్రంలో టాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ . టాక్సీ డ్రైవర్ల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం టీజీపీడబ్ల్యూయు, టీటీడీజేఏసీ ఆధ్వర్యంలో ఛలో అసెంంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు షేక్ సలావుద్దీన్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన సీఎం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ కంపెనీలు ప్రజా రవాణా కోసం బైక్ వాహనాలను అక్రమంగా ఉపయోగించడం నిషేధించాలని, టాక్సీ డ్రైవర్లకు కిలోమీటర్ చార్జీలు ప్రభుత్వమే నిర్ణయించాలని కోరారు షేక్ సలావుద్దీన్.
గిగ్ మరియు ప్లాట్‌ఫారం కార్మికులకు చట్టబద్ధమైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టాక్సీ డ్రైవర్లకు ఓలా, ఉబర్, రాపిడో తరహాలో ప్రభుత్వమే ఒక కొత్త యాప్ తీసుకు రావాలని అన్నారు. రవాణా రంగం కార్మికులకు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. లక్షల ప్రమాద బీమాను 2024-2025 సంవత్సరానికి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు .
హైర్ వెహికల్స్ చార్జీలను ప్రస్తుత రూ. 34,000 నుంచి రూ.55,000 కు పెంచాలన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన టాక్సీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు షేక్ సలావుద్దీన్.