టీజీపీడబ్ల్యూయు ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు- 2025పై సంస్థల తరపున పలు సూచనలు చేశారు. వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పూర్తి నివేదికను సమర్పించారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) , విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ (విధి) సహకారంతో కార్మిక కమిషనర్ కు వివరాణాత్మక సూచనలు సమర్పించడం జరిగిందన్నారు.
ఇటీవల విడుదల చేసిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) చట్టం, 2025 ముసాయిదాపై విస్తృతంగా చర్చించి నివేదిక రూపొందించామన్నారు షేక్ సలావుద్దీన్. TGPWU వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడారు. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికులను గుర్తించి రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతను తాము హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ బిల్లును గిగ్ కార్మికులకు ‘మే డే బహుమతి’గా సమర్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం చారిత్రాత్మకమైనదది పేర్కొన్నారు.
భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు, ప్రపంచానికి ఇది ఒక నమూనాగా ఉండేలా బిల్లును బలోపేతం చేయడం కోసం పలు కీలక సూచనలు చేయడం జరిగిందని చెప్పారు. కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, న్యాయవాదులు, పౌర సమాజ సమూహాలు, పరిశోధకుల సమిష్టి అంతర్దృష్టులను ప్రతిబింబిస్తుందన్నారు. కార్మికులకు బలమైన హక్కులు, అల్గోరిథమిక్ పారదర్శకత, త్రైపాక్షిక పాలన , తక్షణ, ప్రభావవంతమైన అమలు అవసరాన్ని ఇది నొక్కి చెబుతుందన్నారు షేక్ సలావుద్దీన్. రాష్ట్రంలోని అన్ని గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులకు అర్థవంతమైన సామాజిక భద్రత, సంక్షేమ రక్షణలను అందిస్తుందని నిర్ధారించుకోవడానికి TGPWU తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉందన్నారు.