NEWSTELANGANA

ఆర్టీసీ కార్మికుల క‌న్నెర్ర‌..ఆందోళ‌న బాట

Share it with your family & friends

హామీలు చేయ‌డంలో స‌ర్కార్ విఫలం

హైద‌రాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కి చెందిన డ్రైవ‌ర్లు, కార్మికులు, ఇత‌ర సిబ్బంది ఆందోళ‌న బాట ప‌ట్టారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ మోస పూరిత‌మైన హామీలు ఇచ్చింద‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీసీ కార్మికుల విష‌యంలో చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల హామీలు మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం చేశార‌ని, చేత‌ల్లో చూపించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన వాటిని వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. వారంతా జంగు సైర‌న్ మోగించారు.

రాష్ట్ర మంత‌టా అన్ని ఆర్టీసీ డిపోల‌ల‌లో న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మిత్తం రాష్ట్రంలోని 95 డిపోల‌లో 35 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైకి వ‌చ్చారు. వారంతా విధులు నిర్వ‌హిస్తూనే ప్ర‌భుత్వానికి వినూత్నంగా నిర‌స‌న తెలిపారు.

వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించాల‌ని లేక పోతే నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగుతామ‌ని ఆర్టీసీ కార్మికులు హెచ్చ‌రించారు.