మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆన్ లైన్ బెట్టింగ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాసుల మాయలో పడి విలువైన కాలాన్ని యువత దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో మంది వీటి మాయలో పడి ప్రాణాలను కోల్పోతున్నారని వాపోయారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున యువతీ యువకులు ఆన్ లైన్ గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటి పట్ల ఎల్లప్పటికీ అప్రమత్తం కావాలని సూచించారు వీసీ సజ్జనార్.
వందలాది మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండడం పట్ల వేదన చెందారు. వీరిని కోల్పోవడంతో పేరెంట్స్ తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారని తెలిపారు. ఎవరో ఒకరు ఆన్ లైన్ గేమ్స్ తో డబ్బులు సంపాదించారని, వారిని అనుసరించడం మానుకోవాలని హితవు పలికారు మేనేజింగ్ డైరెక్టర్.