కార్తీక పౌర్ణమికి స్పెషల్ బస్సులు
ప్రకటించిన టీజీఎస్సార్టీసీ ఎండీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక ప్రకటన చేసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఏర్పాటు చేయబోయే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.50 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించిందని తెలిపింది.
రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
కార్తీక పౌర్ణమి ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరిన్నీ వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని కోరారు వీసీ సజ్జనార్.