NEWSTELANGANA

అంధ గాయ‌కుడు రాజుకు స‌జ్జ‌నార్ అభినంద‌న

Share it with your family & friends


ఘ‌నంగా స‌త్క‌రించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ

హైద‌రాబాద్ – ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం చేస్తూ ఎలాంటి వాయిద్య ప‌రిక‌రాలు లేకుండానే కేవ‌లం చేతులు, కాళ్ల సాయంతో అద్భుతంగా పాట పాడి వైర‌ల్ గా మారిన అంధ గాయ‌కుడు రాజును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ వైస్ చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్.

ఈ సంద‌ర్బంగా గాయ‌కుడు రాజుతో పాటు ఆయ‌న త‌ల్లిని ప్ర‌త్యేకంగా అభినందించారు. అంతే కాకుండా శాలువాతో స‌త్క‌రించారు. కొంత మేర సాయం చేశారు. దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని రాజు నిరూపిస్తున్నాడ‌ని కితాబు ఇచ్చారు ఎండీ వీసీ స‌జ్జ‌నార్.

మధురమైన గాత్రమే కాదు.. పాట‌కు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాలు లేకుండానే త‌న చేతులు, కాళ్ల‌తో సంగీతాన్ని అందిస్తోన్న అత‌డి ప్రతిభ అద్భుతం అంటూ ప్ర‌శంసించారు.

ఎంతో మంది యువకుడ‌డు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. అరుదైన టాలెంట్ కలిగిన అంధ యువకుడిని ప్రత్యేకంగా అభినందించి.. స‌త్క‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు వీసీ స‌జ్జ‌నార్. ఇదే స‌మ‌యంలో గాయ‌కుడు రాజుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు సంగీత ద‌ర్శ‌కులు కీర‌వాణి, ఎస్ఎస్ థ‌మ‌న్ ను.