భారతీయ పర్యాటకులకు ఖుష్ కబర్
వీసా ఫ్రీ ఎంట్రీ పొడిగించిన థాయ్ లాండ్
ఢిల్లీ – థాయ్ లాండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిత్యం తమ దేశాన్ని సందర్శించేందుకు గాను ప్రత్యేకించి భారతీయులకు తీపి కబురు చెప్పింది. భారత దేశం నుంచి ప్రతి నిత్యం వేలాది మంది థాయ్ లాండ్ ను సందర్శిస్తున్నారు. పర్యాటక రంగం పరంగా పెద్ద ఎత్తున థాయ్ లాండ్ దేశానికి భారీ ఆదాయం వస్తోంది. దీంతో వీసాకు సంబంధించి నిబంధనలను సడించినట్లు తెలిపింది సర్కార్.
భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశ పెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్ లాండ్ పర్యాటక శాఖ నిరవధికంగా పొడిగించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.ఈ పాలసీ విధానం ప్రకారం భారతీయులు థాయ్ ల్యాండ్ లో 60 రోజులపాటు వీసా లేకుండా పర్యటించవచ్చు.
ఈ సమయాన్ని స్థానిక ఇమిగ్రేషన్ కార్యాలయం ద్వారా మరో 30 రోజుల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. వీసా ఫ్రీ ఎంట్రీ గడువును నిరవధికంగా పొడిగించినట్లు న్యూఢిల్లీలోని రాయల్ థాయ్ ఎంబసీ ధ్రువీకరించింది.
ఇక థాయ్ లాండ్ కు వెళ్లాలంటే ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట. ఇంకెందుకు ఆలస్యం ఎంచక్కా ఆ దేశానికి ప్లాన్ చేసుకోండి. ఎలాంటి రూల్స్ పాటించాల్సిన పని లేదు. కాసిన్ని డబ్బులు ఉంటే చాలు..ప్రకృతిని, ఆ దేశపు అందాలను చూడొచ్చు.