ENTERTAINMENT

విజ‌య్ గోట్ మూవీకి భారీ ఆద‌ర‌ణ

Share it with your family & friends

మూవీ మొత్తంలో త‌ల‌ప‌తి దే హ‌వా

హైద‌రాబాద్ – భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది త‌మిళ సినీ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన ది గోట్. ప్ర‌ధానంగా తార‌గ‌ణం ఉన్న‌ప్ప‌టికీ మొత్తంగా ఇందులో డ్యూయ‌ల్ రోల్ పోషించాడు విజ‌య్. ఆ మ‌ధ్య‌న త‌ను రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన చిత్రం ది గోట్. దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి చిత్ర నిర్మాత‌ల‌కు.

ది గోట్ సినిమాను తెర కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు వెంక‌ట్ ప్ర‌భు. గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌లు జ‌రిగినా చివ‌ర‌కు ఈ మూవీని చేసేందుకు ఒప్పుకున్నాడు విజ‌య్. ఇదే క‌థను ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

కానీ త‌ళ‌ప‌తి విజ‌య్ ని డిఫ‌రెంట్ గా చూపించాల‌నే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. అందుకే ఈ చిత్రంపై ఎక్కువ‌గా ఎక్స్పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. ఇదే స‌మ‌యంలో త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో వ‌చ్చే శాస‌న స‌భ ఎన్నిక‌లలో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత విజ‌య్ చిత్రం రిలీజ్ కావ‌డం విశేషం. మొత్తంగా విజ‌య్ ఫ్యాన్స్ కు ది గోట్ ఓ పండుగ అని చెప్ప‌క త‌ప్ప‌దు.