మహనీయులే టీవీకే పార్టీకి ఆదర్శం – తళపతి
పెరియార్..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
తమిళనాడు – టీవీకే ప్రెసిడెంట్, ప్రముఖ నటుడు తళపతి విజయ్ సంచలనంగా మారారు. విల్లుపురంలో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఓ సంచలనం. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు తళపతి విజయ్.
తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. తమ పార్టీ కుల, మతాలకు వ్యతిరేకంగా ఏర్పాటైందని అన్నారు. మహనీయులు పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తమకు ఆదర్శమని, వారి అడుగు జాడల్లో తమ పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు తళపతి విజయ్.
మతాన్ని ఆధారంగా చేసుకుని మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్న భారతీయ జనతా పార్టీ, అవినీతికి కేరాఫ్ గా మారి పోయిన డీఎంకే పార్టీలకు వ్యతిరేకంగా టీవీకే ఇక నుంచి యుద్దం చేస్తుందని ప్రకటించారు.
కులం లేదు..మతం లేదు..మానవత్వమే మన మతమని ప్రకటించిన పెరియార్ , మను స్మృతి ప్రమాదకరమని ప్రకటించడమే కాకుండా అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం అవసరమని భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తమకు ఆదర్శమని స్పష్టం చేశారు తళపతి విజయ్.
“మనమందరం ఒక్కటే కాబట్టి మా మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, మీరందరూ నాకు.. నా హృదయానికి దగ్గరగా ఉన్నారు.”