రోడ్డు ప్రమాదంపై తళపతి విజయ్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం
తమిళనాడు – టీవీకే రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తళపతి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విల్లుపురం జిల్లాలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడు సభకు విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించడం, మరికొందరు గాయపడ్డారు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీవీకే చీఫ్ తళపతి విజయ్. విక్రవాండి వి.రోడ్డు వైపు వస్తుండగా అనుకోని రోడ్డు ప్రమాదంలో మరణించిన సహచరులకు సంతాపం తెలిపారు. తిరుచ్చి దక్షిణ జిల్లా యూత్ లీడర్ న్యాయవాది గిల్లి వీఎల్ శ్రీనివాసన్, తిరుచ్చి సౌత్ జిల్లా ఉపాధ్యక్షుడు కేజే విజయ కళై, చెన్నైలోని బరిమునకు చెందిన వసంత్ కుమార్, రియాజ్ , ఉదయ కుమార్ , మిస్టర్ చార్లెస్ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు తళపతి విజయ్.
నిన్నటి దాకా మన మధ్యన ఉన్నారని, ఇవాళ భౌతికంగా లేక పోవడం అత్యంత విషాదకరమని వాపోయారు . ఈ కోలుకోలేని, భరించలేని పరిస్థితి నుండి బయట పడలేక మనసు బాధ పడుతుందన్నారు.
క్లబ్ కోసం వారు చేసిన కృషి క్లబ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి . వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు తళపతి విజయ్. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్లబ్ సభ్యులు త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.