విజయ్ మ్యాజిక్ ది గోట్ సక్సెస్
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం
హైదరాబాద్ – తళపతి విజయ్ , మీనాక్షి కలిసి నటించిన ది గోట్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. సెప్టెంబర్ 5న గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అన్నీ తానై సినిమాను నటించాడు. ఆయనతో పాటు మీనాక్షి కూడా తళుక్కున మెరిసింది.
రూ. 400 కోట్ల బడ్జెట్ తో ది గోట్ చిత్రాన్ని నిర్మించారు. చెన్నై, థాయ్‌లాండ్, హైదరాబాద్, శ్రీలంక, పాండిచ్చేరి, తిరువనంతపురం, రష్యా , యునైటెడ్ స్టేట్స్ లలో చిత్రీకరించారు. ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు వెంకట్ ప్రభు.
ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ది గోట్ కు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్స్ లో నటించాడు. తండ్రీ కొడుకులుగా విజయ్ ఇందులో పోషించడం విశేషం.
విజయ్ , మీనాక్షితో పాటు అఖిల్, ప్రశాంత్ , ప్రభు దేవా, అజ్మల్ అమీర్ , మోహన్, జయరామ్ , స్నేహ, లైలా నటించారు. అంచనాలకు మించి ది గోట్ పై ఆశలు పెట్టుకున్నారు తళపతి విజయ్ అభిమానులు.
ది గోట్ చిత్రానికి సంబంధించి భారీ ఎత్తున మార్కెట్ పరంగా డబ్బులు వచ్చినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించినందుకు గాను తళపతి విజయ్ కు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.