విజయ్ పర్ ఫార్మెన్స్ సూపర్
ది గోట్ మూవీతో ఫ్యాన్స్ పండుగ
హైదరాబాద్ – తమిళ సినీ రంగానికి చెందిన తళపతి విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను దర్శకులకు కావాల్సిన నటుడు. అసలు పేరు జోసెఫ్ విజయ్. తనకు ముందు నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఇష్టం. అదే తనను రాజకీయ పార్టీ పెట్టేలా చేసింది. పార్టీ ప్రకటన తర్వాత భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ది గోట్.
దీనిని అద్భుతంగా తెర కెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకట్ ప్రభు. భారీ ఎత్తున నిర్మాతలు ఖర్చు చేశారు దీని కోసం. ఇక తళపతి విజయ్ గురించి చెప్పాల్సింది ఏముంది..? తను మినిమం గ్యారెంటీ కలిగిన యాక్టర్. అందుకే ప్రతి దర్శకుడు, నిర్మాతలు తనతో మూవీ చేయాలని అనుకుంటారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకుండా ఉన్న వాటినే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు తళపతి విజయ్. భారీ పారితోషకం తీసుకునే నటులలో తను కూడా ఒకడు. దక్షిణాదిన అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడు కూడా తనే కావడం విశేషం.
మొత్తంగా ఇవాళ తళపతి ఫ్యాన్స్ సంబురాలలో మునిగి తేలుతున్నారు. తమిళనాట అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ది గోట్ కు బిగ్ రెస్పాన్స్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు నిర్మాతలు.