ENTERTAINMENT

త‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ రికార్డ్

Share it with your family & friends

రూ. 400 కోట్ల మార్క్ దాటేసింది

త‌మిళ‌నాడు – ప్ర‌ముఖ త‌మిళ్ సినీ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ , మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన ది గోట్ ఆశించిన దానికంటే ఎక్కువ‌గా ఆద‌ర‌ణ‌కు గురైంది. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ రూ. 400 కోట్ల‌కు పైగా పెట్టుబడి పెట్టిన‌ట్లు టాక్. త‌ళ‌ప‌తి ఈ సినిమా రిలీజ్ చేసే కంటే ముందు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. దీనికి కార‌ణం త‌ను త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొత్త‌గా రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఇందుకు సంబంధించి పార్టీ లోగో, సాంగ్ , ప్రోమోను కూడా విడుద‌ల చేశాడు త‌ళ‌ప‌తి విజ‌య్. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లోనే బ‌రిలోకి దిగుతార‌ని అంతా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తాను వ‌చ్చే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని తెలిపాడు త‌ళ‌ప‌తి విజ‌య్.

మ‌రో వైపు ది గోట్ సినిమాలో రాజ‌కీయ ప‌ర‌మైన డైలాగులు ఉంటాయ‌ని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అవేవీ లేకుండానే పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ గా సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. తాజాగా వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన అన్ని థియేట‌ర్ల‌లో భారీ స్పంద‌న చూర‌గొంటోంది ది గోట్ చిత్రం. పెట్టిన పెట్టుబ‌డి మొత్తం వ‌చ్చిన‌ట్లు టాక్.