ENTERTAINMENT

త‌ళ‌ప‌తినా మ‌జాకా ది గోట్ కెవ్వు కేక

Share it with your family & friends

సంబురాల‌లో విజ‌య్ అభిమానులు

హైద‌రాబాద్ – ఇళ‌య త‌ళ‌ప‌తి విజ‌య్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అంద‌రినీ విస్తు పోయేలా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. కొత్తగా రాజ‌కీయ పార్టీని అనౌన్స్ చేశాడు. దీంతో త‌ను సినిమాలు ఇక చేయ‌డంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ వాట‌న్నింటిని త‌ల‌కిందులు చేస్తూ ఓ వైపు పాలిటిక్స్ లో ఉంటూనే మ‌రో వైపు త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన సినీ రంగాన్ని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశాడు త‌ళ‌ప‌తి విజ‌య్.

ఆయ‌న‌ను అంద‌రూ త‌ళ‌ప‌తి అని పిల్చు కోవ‌డం స‌ర్వ సాధార‌ణం. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు ఎవ‌రైనా ఉన్నారంటే విజ‌య్ అని ఠ‌కీమ‌ని చెబుతారు. ఆయ‌న తాజాగా రాజ‌కీయ ప్ర‌క‌ట‌న త‌ర్వాత విడుద‌లైన చిత్రం ది గోట్. ఇప్ప‌టికే అంచ‌నాల‌కు మించి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. సెప్టెంబ‌ర్ 5న గురువారం దీనిని రిలీజ్ చేశారు.

విజ‌య్ తో పాటు మీనాక్షి చౌద‌రి న‌టించారు. ఈ ది గోట్ చిత్రంలో త‌ళ‌ప‌తి విజ‌య్ డ్యూయ‌ల్ రోల్స్ లో న‌టించాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాలో అన్నీ తానై న‌టించాడు. అగ్ర భాగం త‌న‌దే. ఇత‌ర పాత్ర‌ల‌లో మిగతా న‌టులు న‌టించినా ఫుల్ మార్క్స్ విజ‌య్ కే న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా త‌ల‌ప‌తి ఫ్యాన్స్ మాత్రం సంబురాల‌లో మునిగి పోయారు. బాణా సంచాలు కాలుస్తున్నారు.