మెస్మరైజ్ చేసిన వెంకట్ ప్రభు ది గోట్
హైదరాబాద్ – అంచనాలకు మించి వెంకట్ ప్రభు తీసిన ది గోట్ మూవీ రిలీజ్ అయ్యింది. భారీ ఎత్తున ఖర్చు చేశారు దీని కోసం. అంతకంటే ఎక్కువగా పర్ ఫార్మెన్స్ చేశాడు విజయ్. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ది గోట్ విడుదలైంది. భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఓవరాల్ గా తళపతి విజయ్ తన రూటే సపరేట్ అన్నట్టు ఈ మూవీపై నమ్మకం పెట్టుకున్నాడు. గతంలో ఎన్నో కథలు వచ్చాయి. కానీ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు.
ఇక లక్షలాది మంది అభిమానులను, విజయ్ స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాల్సి ఉంటుంది దర్శకుడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కత్తి మీద సాము లాంటిది. ఇక చిత్రం విషయానికి వస్తే ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ నేపథ్యంగా సాగింది.
ది గోట్ మూవీలో ద్విపాత్రిభినయం చేశాడు తళపతి విజయ్. తండ్రీ కొడుకుల మధ్య యుద్దం ఎలా ఉంటుందనే దానిపై క్యూరియాసిటీ మరింత పెంచే ప్రయత్నం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
మొత్తంగా సినిమాలో ఎందరో నటులున్నా ఇద్దరు మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. వారిలో విజయ్ ఒకరు మరొకరు మీనాక్షి చౌదరి.