అరుదైన నేత మన్మోహన్ సింగ్
భారత దేశానికి తీరని లోటు
ఢిల్లీ – మాజీ పీఎం డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు తలపతి విజయ్. తనను ఆయన ఎంతగానో ప్రభావితం చేశారని తెలిపారు. మన్మోహన్ సింగ్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పదవులు చేపట్టినా ఒదిగి ఉండాలని తెలుసుకున్నానని స్పష్టం చేశారు విజయ్.
శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు నటుడు. మరో వైపు తీవ్ర బాధను వ్యక్తం చేశారు రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ. భారతదేశాన్ని అపారమైన జ్ఞానం, సమగ్రతతో నడిపించారని కొనియాడారు.
అత్యంత నిరాడంబరమైన శైలి, వినయ విధేయతలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. అంతే కాదు ఆయనకు అన్ని అంశాల పట్ల లోతైన అవగాహన ఉందన్నారు. ప్రత్యేకించి ఆర్థిక శాస్త్రంపై డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మంచి పట్టుందన్నారు.
ఒక రకంగా తనకు గురువు, మార్గదర్శిని కోల్పోయానని వాపోయారు రాహుల్ గాంధీ. ఆయనను అభిమానించే లక్షలాది మంది తనను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేశారు. తమ పార్టీకి, దేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు అని పేర్కొన్నారు .