రేవంత్ రెడ్డి చేసింది రైటే
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాద్ – ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది ముమ్మాటికీ సబబేనని అన్నారు.
రేవంత్ రెడ్డిని ఈ సందర్బంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ అవార్డు వచ్చిందని తప్పు చేస్తే వదిలేయాలని ఎక్కడా రూల్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. హీరో అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు అంటూ ఉండవని, ఇది గుర్తిస్తే మంచిదన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ కు లేక పోయినప్పటికీ పరోక్షంగా ఈ ఘటనకు తనే కారకుడని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తమ్మా రెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేశారు. సినిమా రంగం అనేది వ్యవస్థలో భాగమే కానీ చట్టానికి ఎవరూ అతీతం కాదని తెలుసు కోవాలని సూచించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఏ కామెంట్స్ అయినా దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు తమ్మా రెడ్డి భరద్వాజ.