దూసుకు పోతున్న పా రంజిత్ చిత్రం
తమిళనాడు – ప్రముఖ సామాజిక నేపథ్యం కలిగిన దర్శకుడిగా పేరు పొందిన పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలన్ చిత్రం ఊహించని రీతిలో ఆదరణ చూరగొంటోంది. దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15న విడుదల చేశారు పా రంజిత్ , నిర్మాత కేజీ జ్ఞానవేల్ రాజా.
విక్రమ్, పార్వతి, మాళవికా మోహన్ లతో పాటు కీలక పాత్రలు పోషించారు. అద్భుతమైన టేకింగ్ , మేకింగ్ అద్భుతంగా ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 18 వరకు విడుదలైన అన్ని చోట్లా పెద్ద ఎత్తున తంగలాన్ వసూళ్ల పరంగా దూసుకు పోతోంది.
ఇక ఇరు తెలుగు రాష్ట్రాలలో రూ. 6 కోట్లు , తమిళనాడులో రూ. 21.35 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు టాక్. ఇక ఓవర్సీస్ లో రూ. 9 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా చూస్తే తొలి రోజే రూ. 26.15 కోట్లు, 2వ రోజు రూ. 6.45 కోట్లు, 3వ రోజు రూ. 7.60 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఏకంగా రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినీ వర్గాల భోగట్టా.
రాబోయే రోజులలో తంగలాన్ ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.