‘తమిళ వెట్రి కజగం’ సంచలనం
పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్
తమిళనాడు – తమిళనాడు రాజకీయాలలో పెను సంచలనం సృష్టించేందుకు సిద్దమయ్యారు ప్రముఖ నటుడు విజయ్. దేశ వ్యాప్తంగా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత కొంత కాలం నుంచి రాజకీయాలలోకి వస్తారన్న ప్రచారానికి తెర పెట్టేశాడు.
ఎవరూ ఊహించని రీతిలో ఆగస్టు 22న గురువారం తళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. తన కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్బంగా చెన్నై నగరంలో పార్టీ జెండాను విడుదల చేశారు. తమిళ రాజకీయాలలో పెను సెంచలనానికి తెర తీశాడు తళపతి విజయ్. మరింత దూకుడు పెంచే పనిలో పడ్డారు.
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ కలిగి ఉన్నారు. ఆయన మెర్సిల్ చిత్రంలో భారతీయ జనతా పార్టీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , ఆయన పరివారాన్ని బహిరంగంగానే విమర్శించారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అత్యంత జనాదరణ కలిగిన నటుడు ఇలా కామెంట్స్ చేయడం కలకలం రేపింది. అయినా ఎక్కడా తగ్గలేదు విజయ్.
ఆయన ఇంటిపై , పలు చోట్ల ఐటీ దాడులు చేసింది. పదే పదే తళపతి అవినీతి, అక్రమాల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ దానికి పుల్ స్టాప్ పెట్టారు.
పార్టీ జెండాను ఆవిష్కరించిన తళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటామని ప్రకటించారు. అంతకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ తాము పోటీ చేయబోమంటూ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం తళపతి కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు. అవి పూర్తి కావాలంటే దాదాపు ఒక ఏడాది సమయం పట్టనుంది. అవి పూర్తయ్యాక వచ్చే ఏడాది 2025 నుంచి ఫుల్ ఫోకస్ పాలిటిక్స్ మీదే పెట్టనున్నాడు.
పార్టీ జెండాకు సంబంధించి గీతాన్ని కూడా ఆవిష్కరించాడు. పైన..కింద ఎరువు రంగు, మధ్యలో పసుపు రంగు, రెండు ఏనుగులు ఘీంకరించడం, వాటి మధ్యలో పువ్వు వికసించినట్లు, నక్షత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ విడుదల చేసిన పార్టీ జెండా తమిళనాడులో వైరల్ గా మారింది.
పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్ తో ఉంది. మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి.ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటికే తమిళనాడు రాజకీయాలలో సినీ రంగానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కరుణానిధి, జయలలిత, విజయ కాంత్ , కమల్ హాసన్ తో పాటు ఇప్పుడు వారి సరసన తళపతి విజయ్ కూడా చేరాడు. మరి ఏ మేరకు రాణిస్తాడో, ఎలాంటి ప్రభావం చూపుతాడనేది ఉత్కంఠ రేపుతోంది.