రేవంత్ తో రాజయ్య భేటీ
త్వరలోనే కాంగ్రెస్ తీర్థం
హైదరాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా తమ పార్టీలోకి రావాలని రాజయ్యను ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.
రాజకీయ పరంగా అపారమైన అనుభవం కలిగి ఉన్న తాటికొండ రాజయ్య దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో పలు పదవులు నిర్వహించారు. కానీ అనూహ్యంగా ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు కూడా వచ్చాయి.
తాజాగా జరిగిన ఎన్నికల్లో స్టేషన్ ఘణపూర్ నుంచి టికెట్ ను ఆశించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో తీవ్ర ఆవేదన చెందారు తాటికొండ రాజయ్య.
బీఆర్ఎస్ పార్టీలో దళితులకు స్థానం లేదని, ప్రత్యేకించి ఆత్మ గౌరవానికి భంగం కలుగుతోందని ఆవేదన చెందారు. ఈ మేరకు తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆపై కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా త్వరలోనే తాటికొండ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కానున్నారు.