NEWSANDHRA PRADESH

ఏపీ వార్షిక బ‌డ్జెట్ రూ. 2,94,427.25 కోట్లు

Share it with your family & friends

అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన ప‌య్యావుల

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ‌లో ఏపీ రాష్ట్రానికి సంబంధించి 2024-25కు గాను బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు పాల్గొన్నారు.

మొత్తం ఏపీకి సంబంధించి 2,94,427.25 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టారు ప‌య్యావుల కేశ‌వ్. రెవిన్యూ ఖ‌ర్చు 2,35,916.99 కోట్లు ఉండ‌గా మూలధన వ్యయం 32712.84 కోట్లుగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇక రెవిన్యూ లోటు రూ. 34,742.38 కోట్లుగా ఉంద‌ని తెలిపారు.

ద్రవ్యలోటు 68742.65 కోట్లు ఉండ‌గా మొత్తం 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ గా ఉంద‌ని తేల్చారు.

రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు గా పేర్కొన్నారు ప‌య్యావుల కేశవ్. ఇక శాఖ‌ల వారీగా చూస్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు, జల వనరులకు రూ.16,705 కోట్లు.. ఉన్నత విద్యకు రూ.2326 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.11490 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.3,127 కోట్లు, ఇంధన రంగానికి రూ.8,207 కోట్లు, పోలీస్ శాఖ‌కు రూ. 8495 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు.

వీటితో పాటు బీసీ సంక్షేమం కోసం రూ.3,907 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,557 కోట్లు, అటవీ పర్యావరణ శాఖకు రూ.687 కోట్లు, గృహ నిర్మాణం కోసం రూ. 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ కోసం రూ.1,215 కోట్లు కేటాయించిన‌ట్లు ప్ర‌క‌టించారు రెవిన్యూ శాఖ మంత్రి.