ఎన్నికల ప్రచారంలో పిల్లలు వద్దు
స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి పూర్తి వివరాలను తెప్పించుకుంది. జనాభా గణన పూర్తయినప్పటికీ ఇంకా బీసీలు ఎంత మంది ఉన్నారనే దానిపై వివరాలు సమగ్రంగా లేవు.
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. అభ్యర్థులు తమ ఆస్తులు, నగదు, అప్పుల వివరాలు పూర్తిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో చిన్నారులను, పిల్లలను , బాల కార్మికులను ఉపయోగించవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఒక వేళ ఏ పార్టీ అయినా లేదా అభ్యర్థులు ఎవరైనా సరే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
అంతే కాకుండా పోస్టర్లు అంటించడం, నినాదాలు చేయడం, వారితో పద్యాలు, పాటలు పాడించడం, ప్రత్యర్థులపై విమర్శలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రచారంలో వారి పిల్లలను తీసుకురావడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం.