ప్రకటించిన మోదీ కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి ఘటనలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించిన 14 మంది స్థానిక కశ్మీరీల జాబితాను వెల్లడించింది. భారత నిఘా సంస్థలు అందించింది వివరాలను. మహ్మద్ ఆదిల్ రెహమాన్ డెంటు, ఆసిఫ్ అహ్మద్ షేక్, అహ్సన్ అహ్మద్ షేక్, హరీస్ నజీర్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ ఖండే, నజీర్ అహ్మద్ వానీ, షాహిద్ అహ్మద్ కుటే, అమీర్ అహ్మద్ దార్, అద్నాన్ సఫీ దార్ , జుబేర్ అహ్మద్ వానీ, హరూన్ రషీద్ గనై, జాకీర్ అహ్మద్ ఘనీలను సహకరించినట్లు ప్రకటించింది.
నిఘా సంస్థల ఆధారంగా దక్షిణ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా సరే పాకిస్తాన్ కు బుద్ది చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో యావత్ ప్రపంచం సైతం దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండించాయి. రష్యాతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ , ఫ్రాన్స్, ఇటలీ దేశాలు భారత్ కు మద్దతు పలికాయి.