ఘణంగా గణతంత్ర వేడుకలు
అమరావతి – 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన నివాసంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం.
ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్యం కలిగిన ఏకైక దేశం భారత దేశం అన్నారు. రాజ్యాంగం అనేది దేశానికి గుండె కాయ లాంటిదన్నారు. అనంతరం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ప్రాంగణంలో, సీఎస్ శాంతి కుమారి సచివాలయంలో , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.