కిమ్స్ అందిస్తున్న సేవలు భేష్
అమరావతి – సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు అంతా ఏఐదేనని అన్నారు. బుధవారం గుంటూరులో కిమ్స్ శిఖర ఆస్పత్రిని ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల్లో కిమ్స్ అందిస్తున్న సేవలు బాగున్నాయంటూ ప్రశంసించారు.
ప్రతి కుటుంబంలో ఐటీ చదువుకున్న ఒక వ్యక్తి ఉండాలని తాను 1995లో చెప్పానని అది నిజమైందన్నారు. ఇప్పుడు ఏఐదే రాబోయే ప్రపంచమని కుండ బద్దలు కొట్టారు. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయన్నది ముఖ్యం కాదని, ఎంత డేటా ఉందనేది ముఖ్యమని గుర్తు పెట్టుకోవాలన్నారు నారా చంద్రబాబు నాయుడు.
అప్పట్లో గుండె ఆపరేషన్ చికిత్సకు ఎన్టీఆర్ అమెరికా వెళ్లారని, తమ అత్త క్యాన్సర్ తో చని పోయారని ఆవేదన చెందారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎన్టీఆర్ బసవతారకం ఆసుపత్రిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు సీఎం.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారబోతోందని స్పష్టం చేశారు. ఐటీకి కేరాఫ్ గా మార్చేశామన్నారు. ఐటీ అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు.