ENTERTAINMENT

అన్నీ తానై న‌డిపించిన విజ‌య్

Share it with your family & friends

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం

త‌మిళ‌నాడు – ప్ర‌ముఖ న‌టుడు త‌ల‌ప‌తి విజ‌య్ , మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌కత్వం వ‌హించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) సినిమాను అన్నీ తానై న‌డిపించాడు. క‌ల్ప‌త్తి అఘోరం, క‌ల్ప‌త్తి ఎస్ గ‌ణేష్ , క‌ల్ప‌త్తి సురేష్ నిర్మించారు ఈ మూవీని.

విజ‌య్ తో పాటు స్నేహ‌, ప్ర‌శాంత్, ప్ర‌భు దేవా, మోహ‌న్ ప్రేమ్ జీ న‌టించారు. చిత్రానికి ఇళ‌యారాజా త‌న‌యుడు యువ‌న శంక‌ర్ రాజా సంగీతం అందించారు. సిద్దార్థ్ నుని ఛాయా గ్ర‌హ‌ణం అందించారు.

తండ్రి మీద త‌న‌యుడు యుద్దం చేస్తే ఎలా ఉంటుంద‌నేది ఈ మూవీ క‌థ‌. సినిమాలో విజ‌య్ జోసెఫ్ స్పెష‌ల్ యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాట్ లో ప‌ని చేస్తుంటాడు. కెన్యాకు వెళ్లి మాఫియా డాన్ మీన‌న్ ను మ‌ట్టు పెడ‌తాడు. రెండు పాత్రల‌లో న‌టించాడు విజ‌య్. ఒక ర‌కంగా చెప్పాలంటే మూవీ మొత్తం త‌ల‌ప‌తి విజ‌య్ క‌నిపిస్తాడు.

తండ్రీ కొడుకులుగా విజ‌య్ ఆయా పాత్ర‌ల‌లో జీవించారు. సంగీత ప‌రంగా ఆశించిన మేర లేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా సినిమాకు ప్ల‌స్ , హైలెట్ ఏమిటంటే విజ‌య్ జోసెఫ్ కీల‌కంగా ఉండ‌టం. ఇదే సినిమాకు బ‌లం చేకూర్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు పాత క‌థ‌ను తీసుకోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. భార‌త దేశంలో త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో గోట్ ను రిలీజ్ చేశారు.