NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ మ‌రో రెడ్డికి ఛాన్స్

Share it with your family & friends

ప‌ద‌వుల పందేరంలో బ‌హుజ‌నుల‌కు షాక్

హైద‌రాబాద్ – రాష్ట్రంలో రెడ్డి పాల‌న సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని ప్ర‌భుత్వం కొలువు తీరిందో ఆనాటి నుంచి నేటి దాకా తెలంగాణ ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

నామినెటెడ్ పోస్టుల‌లో అత్య‌ధిక శాతం త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే అంద‌లం ఎక్కించారు. బాజాప్తాగా మ‌రీ చెప్పి నియ‌మిస్తుండ‌డంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రో వైపు తెలంగాణ సంస్కృతి, ఆత్మ గౌర‌వం దెబ్బ తీసేలా సీఎం నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ఆంధ్రా ప్రాంతానికి చెందిన న‌లుగురికి పిలిచి మ‌రీ ఉన్న‌త స్థానాల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

ఇదిలా ఉండ‌గా తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఒక‌ప్పుడు టీడీపీలో, త‌ర్వాత బీఆర్ఎస్ లో ఉండి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు సీఎం.

ఆయ‌న‌కు రాష్ట్ర కేబినెట్ హోదాలో వ్య‌వ‌సాయ స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఈ మేర‌కు స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.