Tuesday, April 22, 2025
HomeDEVOTIONALమ‌హ‌నీయుడు సాధు సుబ్ర‌హ్మ‌ణ్య శాస్త్రి

మ‌హ‌నీయుడు సాధు సుబ్ర‌హ్మ‌ణ్య శాస్త్రి

శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ‌వ్యాప్తం చేసిన వ్య‌క్తి

తిరుపతి – తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని ప్రముఖ పరిశోధకులు కృష్ణారెడ్డి కొనియాడారు. శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 136వ జయంతి సంద‌ర్భంగా తిరుప‌తిలోని అన్నమాచార్య కళా మందిరంలో సదస్సు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసిన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి స్వామి వారికి అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని అన్నారు.

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు. టీటీడీలో చిన్న స్థాయి అధికారిగా ఉంటూ వెయ్యికి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు.

టిటిడికి చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ప్ర‌తి ఏటా ఆయ‌న జ‌యంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌డం ఆనందంగా ఉంద‌న్నారు. డిపిపి ప్రాజెక్టు అధికారి రాజ‌గోపాల్‌ మాట్లాడుతూ, శ్రీ సాధు సుబ్రహ్మ ణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగి రేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు చెప్పారు. ఆయ‌న సేవ‌ల‌ను ప్ర‌తి ఏడాదీ స్మ‌రించుకుంటున్నామ‌ని వివ‌రించారు.

ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్య శాస్త్రి కుమార్తె గిరిజాదేవి, మనవడు, జడ్జి శ్రీ సిఎన్.మూర్తి, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments