NEWSTELANGANA

హిమాల‌యాల వేదిక‌గా ల‌గ‌చ‌ర్ల బాధితుల నిర‌స‌న

Share it with your family & friends

వారికి మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – వికారాబాద్ జిల్లా కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ల‌గ‌చ‌ర్ల బాధితులు వినూత్నంగా నిర‌స‌న తెలిపే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ గోడును రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవడం లేదంటూ వాపోయారు. ఇప్ప‌టికే ప‌లువురు సంగారెడ్డి జైలులో మ‌గ్గుతున్నారు. మ‌రికొంద‌రు భ‌యంతో ఊరు విడిచి పారి పోయిన‌ట్లు గిరిజ‌న సంఘాల నాయ‌కులు పేర్కొంటున్నారు.

ల‌గ‌చ‌ర్ల గ్రామ‌స్థుల బాధ‌ను ప్ర‌పంచానికి తెలియ చేసేందుకు హిమాల‌యాల‌కు చేరుకున్నారు. అక్క‌డ ల‌గ‌చ‌ర్ల బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ప్ల కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు గురైన లగ్గచెర్ల రైతులు, గిరిజన మహిళలకు మద్దతుగా, యువకులు సముద్ర మట్టానికి ~ 15,419 అడుగుల ఎత్తులో ఉన్న పంగర్చుల్లా శిఖరాన్ని అధిరోహించారు. మైనస్ ఉష్ణోగ్రతల వద్ద శిఖరాగ్ర సమావేశం జరిగింది . ఉత్తరాఖండ్‌లోని హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలో 3-4 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది.

ఈ యువకుల ప్రయత్నాలు స‌ఫ‌లం కావాల‌ని కోరారు ఎక్స్ వేదిక‌గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్ర‌య‌త్నం చేసినందుకు వారిని మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.