ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఢిల్లీ – 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలో. ఈ సందర్బంగా ప్రపంచ ప్రఖ్యాతమైన ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులందరిని ఆకట్టుకున్నది.
పర్యావరణ హితమైన, సహజ సిద్ధమైన వనరులతో చేసిన ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. బొమ్మలమ్మ బొమ్మలు అంటూ సాగే పాటతో శకటం ముందుకు సాగింది. ఈ సందర్బంగా దీనిని తయారు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
తమ ప్రభుత్వం కళలను, సంస్కృతిని, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏటికొప్పాక బొమ్మల తయారీదారులను ఆదుకుంటామని అన్నారు. వారికి ప్రపంచ స్థాయిలో మరింత ఆదరణ దక్కేలా చేస్తామని తెలిపారు.
ఇప్పటికే ఏపీని పర్యాటక హబ్ గా తయారు చేసేందుకు పర్యాటక రంగ పాలసీని కూడా తయారు చేశామని పేర్కొన్నారు. త్వరలోనే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఫోకస్ పెడుతున్నామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.