NEWSANDHRA PRADESH

ముగిసిన కేబినెట్ 23 అంశాల‌కు ఓకే

Share it with your family & friends

జీవో 62 అమ‌లుపై ప్ర‌త్యేకంగా చ‌ర్చ

అమ‌రావ‌తి – ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం సచివాల‌యంలో జ‌రిగింది. ప్ర‌ధాన అంశాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. దీనిపై ప్ర‌ధానంగా లేవ‌దీశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల .

ఇదిలా ఉండ‌గా జ‌ల‌న వ‌న‌రుల శాఖ‌లో జీవో 62 అమ‌లుపై చ‌ర్చ జ‌రిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కాని గృహాల రద్దు చేసే అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగింది. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా తెలిపింది. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ. 100 కోట్ల‌కు పైగా రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక రంగానికి మేలు చేసేందుకు గాను నిధులు విడుద‌ల చేసింది.

దీంతో సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది.