NEWSANDHRA PRADESH

స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి

Share it with your family & friends

విశాఖ ఉక్కు సంస్థ కార్మికుల డిమాండ్

విశాఖ‌ప‌ట్నం – ఏపీ రాష్ట్రానికి త‌ల‌మానికంగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీక‌ర‌ణ చేయొద్దంటూ కార్మికులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద ధర్నాలో పాల్గొన్నారు కార్మికులు. ఈ సంద‌ర్భంగా కార్మికులు కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని కార్మికులు కోరారు. వర్కింగ్ క్యాపిటల్ కింద తక్షణమే పదివేల కోట్లు కేటాయించాలని అన్నారు .

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన మాటను చంద్రబాబు , పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నిలబెట్టు కోవాల‌న్నారు. లేక పోతే త‌మ ఆందోళ‌న‌ల‌ను తీవ్ర‌త‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.