టైకాన్ సదస్సుకు కేటీఆర్ కు ఆహ్వానం
సీఈఓలు..స్టార్టప్ ఫౌండర్స్..నిపుణులు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జనాదరణ తగ్గడం లేదు. ఆయన గతంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ అనుభవంతో ఎన్నో కంపెనీలు, స్టార్టప్ లు, చైర్మన్ లు, సీఈవోలు, ఫౌండర్లతో నిత్యం టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో లేక పోయినప్పటికీ కేటీఆర్ కు ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి.
తాజాగా సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులతో 1,000 మందికి పైగా పాల్గొనే టైకాన్ (TiECon) కేరళ 2024కు రావాలంటూ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (TiE) నిర్వహణలో ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు వచ్చే నెల డిసెంబర్ 4,5 తేదీలలో రెండు రోజుల పాటు కేరళ లోని కొచ్చిన్ లోని హయత్ హోటల్ లో జరుగుతుంది.
కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్ కానుంది 13వ టైకాన్ సదస్సు. “మిషన్ 2030 – ట్రాన్స్‌ఫార్మింగ్ కేరళ,ష అనే థీమ్ తో దీనిని నిర్వహిస్తున్నారు. కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలను వ్యూహాలను ఈ సదస్సు చర్చించనున్నది.
తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ చూపిన నాయకత్వం, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను పెంపొందించడంలో చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన వ్యూహాలు, ఆలోచనలు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయని నిర్వాహకులు తెలిపారు టైకాన్ కేరళ చీఫ్ జాకబ్ జోయ్ , చైర్మన్ వివేక్ కృష్ణ గోవింద్ .