సత్తా చాటిన తెలుగోడు
సఫారీలకు చుక్కలు
జోహెనస్ బర్గ్ – దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్ లో భారత జట్టు దుమ్ము రేపింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ , తిలక్ వర్మలు పోటీ పడి ఆడారు. తమకు ఎదురే లేదని చాటారు. ఇండియాలో మాత్రమే ఆడతారంటూ వెకిలిగా మాట్లాడిన విదేశీ ఆటగాళ్లకు, వారి ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు మనోళ్లు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే జోహెనస్ బర్గ్ వేదికగా జరిగిన 4వ టి20 మ్యాచ్ లో ఆతిథ్య జట్టు కెప్టెన్ కానీ, జట్టు కానీ ఊహించ లేదు. ఇప్పటికే టి20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
5 మ్యాచ్ లు ఆడిన సంజూ శాంసన్ 3 సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్, ఆటగాడిగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఇక తెలుగు కుర్రాడు హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పిచ్చ కొట్టుడు కొట్టాడు. సఫారీలపై విరుచుకు పడ్డాడు. దీని దెబ్బకు మైదానం అంతా ఫోర్లు, సిక్సర్లతో మోత మోగింది. ఏం చేయాలో పాలు పోక చూస్తూ ఉండి పోయారు సౌతాఫ్రికా ఆటగాళ్లు.
ఇక సంజూ శాంసన్ 109 రన్స్ చేస్తే , తిలక్ వర్మ 120 పరుగులు చేసి ఔరా అనిపించారు. ఇద్దరూ కలిసి నాటౌట్ గా నిలిచాడు. ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు ఏకంగా టి20 ఫార్మాట్ లో 210 పరుగులు జోడించారు. ఇది కూడా ఓ రికార్డే.