టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ సూపర్
రూ. 100 క్లబ్ లోకి చిత్రం
హైదరాబాద్ – ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ . గతంలో సిద్దు నటించిన డీజే టిల్లు దుమ్ము రేపింది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని మరింత మసాలా, రొమాన్స్ , కాసిన్ని డైలాగులతో పర్వాలేదనిపించేలా తీశాడు డైరెక్టర్.
మోతాదుకు మించిన సన్నివేశాలు ఉండడంతో కుర్రకారు కెవ్వు కేక అంటున్నారు. అసలే పరీక్షలు అయి పోవడంతో చాలా మంది టిల్లు స్క్వేర్ వైపు చూస్తున్నారు. నిర్మాతకు కాసుల పంట పండుతోంది. ఇప్పటికే స్టార్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.
తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 23 కోట్లకు పైగా వసూలు చేసింది. మూడు రోజుల్లో రూ. 50 కోట్లు దాటినట్లు టాక్. ప్రస్తుతం 10 రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి దూసుకు పోతోంది టిల్లు స్క్వేర్.
ఇదిలా ఉండగా ఈ విషయాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక రాబోయే ఉగాది, రంజాన్ మాసం ఉండడం, సెలవులు రావడంతో సిద్దు, అనుపమలను చూసేందుకు మరింత భారీగా ఎగబడే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.