తిరుమలలో ఆరధాన ఉత్సవాలు
8 నుండి 10వ తేదీ వరకు
తిరుమల – తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఇందులో భాగంగా 7న తిరుమల కల్యాణ వేదికలో యువ కళాకారులతో శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక సంగీత కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
20న భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుమల నాద నీరాజనం వేదికపై శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహిస్తామని పేర్కొంది. 24న కుమారధార తీర్థ ముక్కోటి చేపట్టనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రిలో 26 నెలల్లో 2,350 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని తెలిపింది. రెండు రోజుల వయసు గల చంటి పాపకు కూడా గుండె ఆపరేషన్ చేయడం జరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో తొలిసారిగా 11 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేపట్టినట్లు వెల్లడించారు ఈవో ధర్మా రెడ్డి.