DEVOTIONAL

తిరుమలలో నిండు కుండలా జలాశయాలు

Share it with your family & friends

గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

తిరుమల – తిరుమలలో కురిసిన వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ఓవర్ ఫ్లో అవుతున్నాయి‌. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 355 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 5192.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

4) కుమారధార డ్యామ్ :- 898.15 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 4229.42 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

5) పసుపుధార డ్యామ్ :- 898.15 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 1267.48 ల‌క్ష‌ల గ్యాలన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *